Logo
Date of Publish : 22 July 2021, 4:47 pm
Editor : Sake Naresh

బాపట్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

          గత వారం మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ రాష్ట్ర సమావేశంలో గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులుగా గాదె వెంకటేశ్వరరావు గారిని పార్టీ అధినేత పవన కల్యాణ్‌ గారు నియమించిన విషయం అందరికీ విదితమే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా, జనసేన శ్రేణులను ఉత్తేజపరుస్తూ నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నేడు బాపట్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. జనసేన పార్టీ నియోజకవర్గ క్రియాశీలక నాయకురాలు శ్రీమతి గుంటుపల్లి తులసీ కుమారి గారి ఆధ్వర్యంలో మరియు ప్రవాస జనసేన నాయకులు కృష్ణ ఇక్కుర్తి గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన శ్రేణులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమానికి ముఖ్య అతిధులుగ విచ్చేసిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారిని గజమాలతో సత్కరించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దంటూ జనసైనికులకు భరోసానిస్తూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అందరూ కలసి ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలని కార్యకర్తలకు నిర్ధేశించారు. జనసేన నాయకురాలు తులసీ కుమారి గారు మాట్లాడుతూ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా శ్రీ గాదె వెంకటేశ్వర్లు గారికి ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ మరింత బలపడేలా కృషి చేస్తారని ఆశిస్తున్నాను .ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేసిన ప్రతి ఒక్క జన సైనికులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com