Logo
Date of Publish : 09 April 2022, 3:27 pm
Editor : Sake Naresh

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం

    మండపేట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ చేయని సాహసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నారని కొనియాడుతూ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా లక్ష రూపాయలు ఇవ్వడానికి తన సంపాదనలో 5 కోట్లు విరాళం జనసేనపార్టీకు ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంత ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని జయప్రదం చేయాలని జనసైనికులు అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యలపై జిల్లా కార్యవర్గానికి తగు సూచనలు ఇచ్చారు. అవసమైతే జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వుండే సమస్యలపై పోరాడటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో జనసేన బలోపేతం చేసేందుకు అందరూ మరింత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పార్టీ నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండలం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com