Logo
Date of Publish : 06 February 2022, 4:37 pm
Editor : Sake Naresh

తాడేపల్లి మండలంలో జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం

     తాడేపల్లి, (జనస్వరం) : తాడేపల్లి కొలనుకొండ గ్రామంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుల సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాడేపల్లి మండల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపేలక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చూడాలని ఆవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఈ పాలనకు చరమగీతం పాడ వలసిన సమయం వచ్చిందని అన్నారు. అలాగే పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మరియు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి విభాగం మెంబర్ చవ్వాకుల కోటేష్ బాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రావిరామా, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, చేనేత వికాసం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, దుగ్గిరాల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఈమని గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి సాయి చైతన్య, సీనియర్ నాయకులు దాసరి శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com