కైకలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గములో నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం మండవల్లిలోని శుభమ్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామ్ కృష్ణ(రాము) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మండవల్లి సెంటర్ నందు నియోజకవర్గ జనసైనికులు, నాయకులు బండ్రేడి రామ్ గారికి ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం సెంటర్లో ఉన్న డా.B R అంబేద్కర్, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగా గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండవల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని అధ్యక్షులు వారి చేతులు మీదగా ప్రారంభించారు. అనంతరం ఫంక్షన్ హాల్ కి చేరుకొని కైకలూరు నియోజకవర్గ నాయకులకు, జనసైనికులకు దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో బండ్రేడి రాము మాట్లడుతూ రాబోయే ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గ గడ్డపై జనసేన పార్టీ జండా ఎగర వేస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా ఉపాధ్యక్షలు మత్తి వెంకటేశ్వర రావు, చౌదరి, రాష్ట్ర కార్యదర్శి లీలా కానక దుర్గా, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపురపు రాజబాబు, కార్యదర్శి బి. వి రావు, సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యవర్గం, ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వేంకటేశ్వర రావు, మండవల్లి మండల అధ్యక్షురాలు బోయిన ప్రశాంతి, కైకలూరు మండల అధ్యక్షులు ముమ్మారెడ్డి నగమల్లేశ్వర రావు, కలిడింది మండల అధ్యక్షులు బెల్లంకొండ బాబు, నియోజకవర్గ నాయకులు నల్లగోపుల చలపతి, కొల్లి బాబీ, పోకల కృష్ణా, తోట లక్ష్మీ, మోటేపల్లి హనుమా ప్రసాద్, వర్రే హనుమా, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com