పెందుర్తి నియోజకవర్గం 88వార్డ్ సబ్బవరం మండలం గంగవరం గ్రామంలో రాజు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన జెండా పట్టుకున్న కార్యకర్తకి క్రియాశీలక సభ్యత్వం వారధిగా పని చేస్తుందని అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేయడానికి మన యొక్క శక్తిని పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసు౦టుందని, మిగతా పార్టీలు కార్యకర్తలను వాడుకుంటే మన జనసేన పార్టీ మాత్రం జనసైనికుని మరియు వారి కుటుంబం బాగోగులు చూసుకోవడం కోసం ఆలోచిస్తోందని అన్నారు. దానికోసం ఆరోగ్యరీత్యా అవసరమైతే 50 వేల రూపాయలు, అనుకోకుండా జనసైనికుడు మరణిస్తే వారి కుటుంబానికి 5లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కూడా లభిస్తుందని అన్నారు. జెండా పట్టుకున్న జన సైనికుడు కోసం పవన్ కళ్యాణ్ గారి నిరంతరం ఆలోచిస్తారని కావున క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు తప్పనిసరిగా జనసైనికులు ని గుర్తించి వారికి సభ్యత్వం వల్ల వచ్చే లాభాలను వివరించి క్రియాశీలక సభ్యత్వం తీసుకునే విధంగా చైతన్యం చేయాలని అది మీ బాధ్యత అని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో జనసేన పార్టీ జెండా ఎగిరే లాగా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచే లాగ మనందరం పనిచేయాలని సమాజ మార్పు కై మన వంతు సహకరించాలని కోరడం జరిగింది. వెదుళ్ళ నరవ సర్వసిద్ధి రాజు గారు మాట్లాడుతూ ఈ యొక్క క్రియాశీలక సభ్యులుగా మన జనసైనికులు చేర్చుకోవాలని వేరే పార్టీకి చెందిన వారు గానీ కోవర్ట్ లకు అవకాశం ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. క్రియాశీలక సభ్యులు ఐడి తీసుకున్న బలిరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని ఈ మూడు గ్రామాల్లో ఉన్న జనసైనికులు అందరికీ క్రియాశీలక సభ్యత్వం వచ్చేలాగా ఒక బాధ్యతగా చేస్తానని మాట్లాడడం జరిగింది. చివరగా రాజు గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జనసేన కుటుంబ సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ గంగవరం శ్రీను గారు, జగదీష్, నరేష్, రాజు, అర్జునగిరి గ్రామ జనసైనికులు, గోపి, వెదుళ్ళ నరవ జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.