
గాజువాక నియోజకవర్గం మంగళ పాలెంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో సిరిసపిల్ల అప్పారావు గారు మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా 2019 ఎలక్షన్ లో చేసిన తప్పులను సరిదిద్దుకొని మంగళ పాలెం లో ఓటర్స లో 90% జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు వేసేలా కష్టపడాలని కోరడం జరిగింది. రాజేష్ గారు మాట్లాడుతూ 88 వ వార్డులో సర్వే ప్రకారం జనసేన పార్టీ గెలుస్తుంది కావున ఎక్కువ మెజార్టీ రావడానికి మనందరం కష్టపడాలని కోరడం జరిగింది. అప్పల రాజు గారు మాట్లాడుతూ మన గ్రామంలో చాలా సమస్యలున్నాయి ప్రభుత్వాలు మారాయి అధికారాలు మారారు ఎమ్మెల్యేలు మారారు టిడిపి ప్రభుత్వం గానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గానీ మన గ్రామ అభివృద్ధికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని కావున ప్రజల వద్దకు ఈ సమస్యలను ఈ ప్రభుత్వ వైఫల్యాలను తీసుకుని వెళ్లి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజల్లో బలపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలని సైనికులు కోరడం జరిగింది. కార్పొరేటర్ అభ్యర్థి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ మంగళపల్లి లో జనసైనికులు ఐకమత్యాన్ని చూసినట్లయితే మీరు మిగిలి గ్రామానికి మార్గదర్శకులుగా ఉంటారని, మీ గ్రామంలో ఉన్న ఐకమత్యం అన్ని గ్రామాల్లో ఉన్నట్లైతే తప్పకుండా జనసేన పార్టీని అందరూ ఆశీర్వదిస్తారని, రాబోయే రోజుల్లో మంచి రోజులు నీ జనసేన పార్టీ అని, నేను మీ లాంటి సామాన్య జనసైనికుడి మీతో పాటు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే దానికి నా వంతు కృషి చేస్తానని, 88 వార్డ్ జనసేన పార్టీ ని చూసి టిడిపి వైఎస్ఆర్సిపి నాయకులు భయపడుతున్నారని కావున మనమందరం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంగలపాలెంలో ఎక్కువ మెజార్టీ జనసేనకు వచ్చేలాగా కష్టపడాలని, మన గ్రామ సమస్యలు తొలగిపోవాలంటే మనందరికి జనసేన పార్టీ గెలుపే ముఖ్యమని, కావున ప్రజలందరూ దగ్గరికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలను తీసుకుని వెళ్లి జనాల్లో చైతన్యం తీసుకురావాలని జనసైనికులు ఉద్దేశించి కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హనుమంతరావు గారు ఏ వి రమణ గారు తాత బాబు గారు సురేష్ కుమార్ గారు వార్డు ముఖ్య నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.