
పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ వీరఘట్టం మండలం స్థాయి కార్యకర్తల సమావేశం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 42 గ్రామ పంచాయతీల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ… గ్రామాల్లో విస్తృత స్థాయి జనసేన పార్టీ పర్యటనలు చేపట్టాలని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టాలని ఆయన అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సమస్యల మీద నేను స్పందిస్తూనే ఉంటానని, అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా NRI త్రిశూల్ టీం సభ్యులు వండాన వినయ్ కుమార్ పాల్గొన్నారు. పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ మేనిఫెస్టో ను, గుర్తును సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండల జనసైనికులు వజ్రగడ రవికుమార్, మత్స పుండరీకం, గర్భాపు నరేంద్ర, KVR నాయుడు, గోపాలకృష్ణ, గోవిందరావు, భూషణ్, తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.