సీతంపేట, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట మండలం మండ పంచాయతీ పరిధిలోని నారాయణ గూడ గ్రామాన్ని పాలకొండ జనసేన నాయకులు సందర్శించడం జరిగినది. అనంతరం గ్రామంలోని యువకులుతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపు నివ్వడం జరిగింది. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు తీసుకునేలాగా కార్యకర్తలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు శ్రీకాంత్, ఉపేంద్ర, విశ్వనాథ్, గంగూలీ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com