Logo
Date of Publish : 12 April 2022, 1:45 am
Editor : Sake Naresh

హుకంపేట మండల జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

   హుకంపేట, (జనస్వరం) : అల్లూరి సీతరామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండల పరిధిలో దుర్గం పంచాయితీలో జనసేనపార్టీ హుకుంపేట మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. హుకుంపేట మండల నాయకులు కాంబిడి సుధీర్ కుమార్, బలిజ కొటేశ్వరవు, పడల్ అధ్యక్షతన జరిగిన మండల స్థాయి సమావేశంలో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడా, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలం పంచాయితీ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా దుర్గం పంచాయతీలో సమావేశమైన జనసైనికులు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పనిచేయాలని పిలుపిచ్చారు. మన్యంలో జనసేనపార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో త్వరలో జనసేనపార్టీలో భారీస్థాయిలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో కార్యకర్తలకు నూతనోత్సాహం కలిగింది. ఈ కార్యక్రమంలో మండలస్థాయి నాయకులు, పార్లమెంట్ కమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు, శెట్టి ఆనంద్, దూరియా సాయిబాబా, జవహర్, నాగరాజు, బాబురావు, సురకత్తి రాంబాబు, శ్రావణ్ కుమార్, శోభన్ బాబు, అర్జున్, మహేష్, భరత్, రాజ్ కుమార్, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com