Logo
Date of Publish : 12 October 2021, 5:24 pm
Editor : Sake Naresh

కుప్పం నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

        కుప్పం, (జనస్వరం) : కుప్పం నియోజకవర్గ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఏ వింధంగా ముందుకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తగిన సూచనల గూర్చి  కుప్పం ఇంఛార్జ్ శ్రీ వెంకట రమణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు.  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ఈ కార్యక్రమములో కుప్పం నియోజకవర్గములో పూర్తయిన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ ను జిల్లా అధ్యక్షులు పి. హరిప్రసాద్ సమక్షంలో క్రియశీలక సభ్యులకు అందజేశారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అనీ, ఈ సభ్యత్వంతో పాటు సభ్యులకు ఇచ్చిన భీమాసౌకర్యంతో ప్రమాదం జరినపుడు, వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణహాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామని, దేశంలో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది. రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని, సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, లీగల్ సెల్ అధ్యక్షులు మండల స్థాయి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com