Logo
Date of Publish : 21 October 2021, 4:44 pm
Editor : Sake Naresh

ఆత్మకూరు నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

     ఆత్మకూరు, (జనస్వరం) :  ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కార సాధనకై భవిష్యత్తు ప్రణాళికను రూపొందించేందుకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసైనికులతో కలసి నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజు ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలపై, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. సంవత్సరం పూర్తయినప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార దిశగా, ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు చేపట్టడం జరగలేదు. నియోజకవర్గ రైతాంగ ప్రధాన సమస్యలైన సమగ్ర సోమశిల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించడం, చుక్కల భూముల సమస్యను సుమోటోగా పరిష్కరించడం, సంగం బ్యారేజీని త్వరితగతిన పూర్తి చేయడం, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించడం, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహదపడే నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేయడం, నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే విధంగా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయడం మొదలగు సమస్యలపై ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున పోరాడేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ విషయమై నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జనసేన నాయకులు మరియు జనసైనికులతో సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com