Logo
Date of Publish : 12 January 2022, 4:09 pm
Editor : Sake Naresh

ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

   ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు రూరల్ మండల, జనసైనికుల ఆత్మీయ సమావేశం ఆత్మకూరు జనసేనపార్టీ కార్యాలయంలో జరిగింది. దీనికి ముందు ఆత్మకూరు పట్టణంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో, భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు రూరల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రత్తిపాటి ప్రవీణ్ కుమార్ గారిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే వరకు ప్రతి జనసైనికుడు అహర్నిశలు పనిచేయాలని అన్నారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను కొనియాడడం జరిగింది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన వంద మంది యువకులు ఉంటే, దేశ స్థితిగతులను మార్చవచ్చు అన్న వివేకానందుని బోధనలు స్ఫూర్తిగా, భావితరాలకు సువర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా, జనసైనికులు అందరూ ముందుకు నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేనపార్టీకి చెందిన ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com