
కడప ( జనస్వరం ) : జనసేన పార్టీ వీర మహిళ విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు కుప్పాల జ్యోతి ఆధ్వర్యంలో కడప జిల్లా వీర మహిళ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జనసేనపార్టీ వీరమహిళల ఆధ్వర్యంలో కడప జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, ప్రాంతీయ కమిటీ సభ్యులు ఆకుల వనజ, హసీనా బేగం, జనసేన కడప నాయకులు ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సురేష్ బాబు, విశ్వనాథ్, వీర మహిళలు పాల్గొన్నారు.