కళ్యాణదుర్గం, (జనస్వరం) : భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం తీసుకురానటువంటి కార్యక్రమాన్ని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చారు. కార్యకర్తలకు భరోసాగా నిలబడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ జనసేనపార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వచ్చింది. 500 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అనుకోని సంఘటనల వల్ల ప్రమాదాలకు గురి అయితే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది.
• జనసేన పార్టీకి కార్యకర్తలే బలం - వారే మా సంపద..
జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జనసేనపార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల ఫిబ్రవరి 10 నుండి 28 వరకు జనరగనున్నది. ఇందుకోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జనసేన నాయకులు క్రియాశీలక సభ్యత్వం వాలెంటరు లిస్టు తయారుచేసి జిల్లా అధ్యక్షులు TC వరుణ్ కి అందజేయడం జరుగుతుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఇప్పటివరకు నమోదైన అయినా వారి వారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాలి సభ్యత్వం తీసుకొని వారు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రమాదంలో గాయపడిన 169 సభ్యులకు 60 లక్షల 90 వేల 781 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 96 మంది సభ్యులకు 4 కోట్ల 86 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. మొత్తం 5 కోట్ల 40 లక్షల 90 వేలు 781 రూపాయలు జనసేనపార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య. సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, జనసేన నాయకులు వంశీకృష్ణ, జాకీర్, సయ్యద్ కంబదూరు మండలం ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, సురేష్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com