Logo
Date of Publish : 02 October 2022, 3:51 pm
Editor : Sake Naresh

అమలాపురం నియోజకవర్గములో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

      అమలాపురం, (జనస్వరం) : జనసేన పార్టీ ఐటీ విభాగం అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పలచోళ్ళ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు, ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతి క్రియాశీలక సభ్యుడు జనసేనపార్టీ అస్త్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు వీక్షించే విధంగా చూడాలని, అదేవిధంగా నా సేన కోసం -  నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ పలుచోళ్ళ వేణు, జిల్లా కో-ఆర్డినేటర్ గాలిదేవర తామేష్ కోరారు. అగ్నికులక్షత్రియుల సమస్యలపై మంగళవారం 4వ తేదీ అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వందలాదిగా అగ్నికుల క్షత్రియులు, జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియుల సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు రాష్ట్ర, జిల్లా నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించిన పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com