తాడేపల్లిగూడెం, (జనస్వరం) : తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం గౌడ సంఘం ఆత్మీయ సభ మరియు పెంటపాడు మండలం తెలుగుదేశం ఆత్మీయ సభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గౌడ సంఘం కులవృత్తుల వారు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడటం కోసం వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిన వెంటనే వారి కొరకు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో గౌడ భవనం సగంలో ఆగిపోవడం తెలుసుకొని జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి గా నన్ను గెలిపించిన వెంటనే ఇదే గౌడ మీటింగ్‌లో మాటిచ్చినట్టు ఆ కమిటీ హాల్‌ను పునరుద్ధరణ చేసి 2025 లో గౌడ నాయకులతో కలిసి ప్రారంభిస్తానని మాటిచ్చారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలవల బాబ్జి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి నీ ప్రకటించిన కానించి నా వెన్నంటే ఉంది బాబ్జి ఉమ్మడి పార్టీని ముందుకు తీసుకు వెళ్తూ జనసేన తెలుగుదేశం బిజెపి కార్యకర్తలతో సమిష్టిగా ముందుకు వెళ్లేలాగా కార్యచరణాలు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కడవల నియోజకవర్గ ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com