“జనసేనపార్టీకి ఆయువుపట్టు పూతలపట్టు” అని జనసేనపార్టీ రాష్ట్ర పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, రాయలదక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ నియోజక వర్గాల సమన్వయకర్తల కమిటీ కన్వీనర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉద్ఘాటించారు. అలాగే జనసైనికుల జోలికి ఏ ఇతర పార్టీల నేతలు వచ్చి ఇబ్బందులకు గురి చేయాలని చూసినా.. చూస్తూ ఊరుకోమని ఖబడ్దార్.. అంటూ నాయకులు అందరూ జనసైనికులకు భరోసాను, మనోస్థైర్యాన్ని ఇచ్చారు. దీంతో సమావేశ మండపంలో ఈలలు వేసి, చప్పట్లు కొట్టి, జైజనసేన జైజైపవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు, జోరుగా హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చేయడంతో హర్షధ్వానాలు మిన్నంటాయి. “జనసేనానికి తోడుగా… జనసైన్యం” మేముసైతం ఉన్నామంటూ జనవరి రెండోతేదీన శనివారం చిత్తూరుజిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐదు వందల మంది ముఖ్య జన సైనికులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం నరిగన్నగారి తులసీప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. కార్య నిర్వాహకులుగా జిల్లా కో- ఆర్డినేటర్ పుంగనూరు నానబాల లోకేశ్వర (లోకేష్ రాయ్) సారథ్యంలో ఏ.పీ. శివయ్య, రాగల శ్రావణ్ కుమార్, మనోహర్, మైలారి కిషోర్, పురుషోత్తం, మహేష్, జయప్రకాష్, చంటి రాయల్, గోపీచంద్, నెహ్రూ రాయల్, కుమార్, ప్రసాద్, వ్యవహరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయల దక్షిణకోస్తా సంయుక్త పార్లమెంటరీ నియోజక వర్గాల సమన్వయకర్తల కమిటీసభ్యులు, రాయల సీమ మూడు జిల్లాల సమన్వయకర్తల త్రిసభ్య కమిటీ సభ్యులు గంగారపు రాందాస్ చౌదరి, అడ్వకేట్ అండ్ డాక్టర్ మాసి కృష్ణమూర్తి, పొన్న యుగంధర్, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ సయ్యద్ ముకరం ఛాన్, తిరుపతి నియోజక వర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, అఖిలభారత చిరంజీవి యువత చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పూల ప్రభాకర్, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ముద్దినేని వెంకట రమణ, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పబ్లిసిటీ అండ్ క్యాంపైనింగ్ కో-కన్వీనర్ దారం అనిత, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత కోట చంద్రబాబు, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ము.వె.ర.కి రాజకీయ కార్యదర్శి కోట్లవారి రామమూర్తి, చంద్రగిరి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ దేవర మనోహర్, పుంగనూరు పవన్ కళ్యాణ్ అభిమానసంఘం అధ్యక్షుడు చిన్నారాయల్, సీనియర్ నాయకులు కృష్ణయ్య, గంగాధర నెల్లూరు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు లోకనాధ నాయుడు, దేవకిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు పూలవర్షంతో, బ్యాండ్ మేళాలతో ఘనస్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేసి, గజపూల మాలలువేసి శాలువాలు కప్పి నరిగన్నగారి తులసీప్రసాద్ బృందం సత్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. జనసేనపార్టీకి ఆయువు పట్టు అయిన పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, మెగాఫ్యామిలీ అభిమానులు, వీర మహిళలు అందరూ క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషిచేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాళ్యం, ఐరాల, యాదమరి, తవణంపల్లి, పూతలపట్టు మండలాల్లో జనసైనికులను ఏకతాటి పైకి తెచ్చినఘనత తులసీ ప్రసాద్ బృందసభ్యులదేనని, ఇది ఎంతో శుభసూచకం అని ఎంతగానో పార్టీ ప్రముఖులు మెచ్చుకున్నారు. కరోనా విపత్కాలంలో కూడా ప్రతి గ్రామంలో సైతం లక్షలాది రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ అండగా జనసేనపార్టీ జనసైనికులు నిలిచారన్నారు. పార్టీ అభ్యున్నతికి నిత్యం శ్రమించేతత్వం పూతలపట్టు నియోజకవర్గ నాయకులందరికీ ఉందని వక్తలు కొనియాడారు.
వేపనపల్లిలో అన్నదానం చేసిన జనసైనికులు:-
ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఇన్ఛార్జ్ లేకున్నప్పటికీ ప్రతిఒక్కరూ సంఘటితంగా రాజంపేట, చిత్తూరు జిల్లాలలోని ప్రతి ఒక ముఖ్య నాయకులను, జనసైనికులను, వీరమహిళలను, అందర్నీ గుర్తుంచుకొని ఆహ్వానించడం చూస్తే.. జనసేనాని పవన్ కళ్యాణ్ పట్లగౌరవం, ఆయన ఆశయాల సాధనకు చేస్తున్న కృషి వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఈసందర్భంగా వేపనపల్లి గ్రామంలో జనసైనికులు “అన్నదాన కార్యక్రమం” చేపట్టారు. ఆపదలో ప్రజలు ఉన్నారన్న విషయం తెలియగానే జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మీకు అండగా మేమున్నాం అంటూ తమ శక్తికి మించి సహాయకార్యక్రమాలు చేపట్టి ఆదుకుంటున్న గొప్పమానవతావాదులు జనసేనశ్రేణులని గ్రామస్థులు పేర్కొన్నారు. సిద్ధాంతాలను నిత్యం ప్రజలకు చేరవేస్తూ, పార్టీ బలోపేతంపట్ల అకుంఠిత దీక్షాదక్షతతో సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి లోటుపాట్లులేకుండా చాలా చక్కగా నిర్వహించిన లోకేష్ రాయ్ బృందానికి, సహకరించిన జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు, పేరునా ముఖ్య అతిథులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో యతేంద్ర, సుమన్, సురేష్, నెహ్రూ రాయల్, ఆగారపు రమేష్, చందు, దుర్గారాయల్, కిరణ్, వేములపవన్, మునికృష్ణ, చిరంజీవి, నీరజాక్షులు, ఓంప్రకాష్, పలువురు వీరమహిళలు అధికసంఖ్యలో జన సైనికులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.