శింగనమల ( జనస్వరం ) : నార్పల గ్రామ పంచాయితీ పరిధిలో గల క్రాసింగ్ వద్ద నాలుగు వైపులా వున్న ప్రధాన మెయిన్ రోడ్ నిత్యం వేల మంది చుట్టుప్రక్కల గ్రామాలకు రాకపోకలు ఈ నాలుగు లైన్ల క్రాస్ రోడ్ లో అతి పెద్ద జనాభా తిరుగుతూనే ఉంటారు. అయితే పొంచి ఉన్న ప్రమాదానికి గల కారణం స్పీడ్ బ్రేకర్లు లేనందున గత రెండు నెలల క్రితం సీఎం పర్యటన సందర్భంగా ఉన్న స్పీడ్ బ్రేకర్లు తొలగిస్తూ నూతన రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది, పర్యటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు లేయలేదని,ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వలన కొన్ని రోజులుగా ప్రతి రోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నా సమస్యను ఎవ్వరు పట్టించుకోలేదని నార్పల జనసేనా మండల నాయకులు వాపోయారు. ప్రస్తుతం చిన్న చిన్న సంఘటనలు మాత్రమే జరుతున్నాయని,పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నా సమస్యాత్మకమైన కూడలి కనుక మీరు చొరవ తీసుకొని కూడలిలో నాలుగు వైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే ప్రభుత్వ బాలుర పాఠశాల మరియు ప్రాథమిక బాలికల పాఠశాల వద్ద ఎంపిడిఓ ఆఫీస్ మరియు దిగుమర్రి క్రాస్ రోడ్ నాలుగు లైన్ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చెప్పట్టేలా సంబధిత అధికారులకు ఆదేశించాలని జనసేన పార్టీ తరపున అధికారులకు విన్నవించారు. ఎంపీడీఓ దివాకర్ స్పందిస్తూ రోడ్డు భవనాల అధికారుల తో చర్చించి త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్,పొన్నతోట రామయ్య,వినోదం లోకేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com