విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాన కూడలిలో ఆదివారం జరిగిన బస్ ప్రమాదం పట్టణ ప్రజలను చాలా కలచివేసి, భయబ్రాంతులను చేసింది. ఇప్పటికైనా అధికారులు మేలుకొని నగరంలో ప్రధాన కూడలైన కలక్టరేట్ వద్దనున్న నాలుగు రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు, సిగ్నల్ లైట్లు వెలిగేటట్లు తక్షణమే చేయాలని జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం కలక్టరేట్ గ్రీవిన్స్ లో కలెక్టర్ శ్రీ హరిజవహర్‌లాల్ గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, సంబంధిత సూపరెండెంట్ ఆఫ్ పోలీసు అధికారులకు వినతిని పంపారు. ఈసందర్భంగా జనసేన నాయకులు బాలు మాట్లాడుతూ పట్టణంలో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడం మొదటిసారని, పట్టణంలో ప్రధాన కూడలైన కలెక్టరేట్ మరియు జాతీయ రహదారి కూడా కావడం వలన అక్కడ నిత్యం విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని, ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి కనీసం ట్రాఫిక్ పోలీస్ కూడా ఉండటం లేదని, సిగ్నల్ లైట్స్ ఉన్నాకానీ అవి సరిగా పనిచేయడం లేదని, ఇన్నిరకాల కారణాల వల్లనే అక్కడ అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ నిర్లక్ష్యం వలనే నిన్న అంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం అని మా అభిప్రాయమని. కావున దయచేసి, చొరవ చేసి అక్కడ నిరంతరం పోలీస్ బీట్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, చుట్టూ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కోరుతూ జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తూ వినతిపత్రాన్ని అందజేసామన్నారు. ఈకార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళ శ్రీమతి భారతి గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు పిడుగు సతీష్, జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, ఏంటి రాజేష్, భవాని పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com