పిఠాపురం ( జనస్వరం ) : గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్‌కి పిఠాపురం జనసేన నాయకులు ఉప్పాడ కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామ పంచాయతీ తోటఊరు అనే గ్రామంలో వీధిలైట్లు కొరకై దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. దానిపై తక్షణమే కలెక్టర్ స్పందించి సీసీకి సిఫార్సు చేసి, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటలకు తోటఊరు గ్రామంలో ఎలక్ట్రికల్ లైట్స్ వేయటం జరిగిందని, దీనికి సంబంధించి తక్షణమే స్పందించి పనిచేయించిన కలెక్టర్‌కి పిఠాపురం జనసేన నాయకులు పిఎస్‌ఎన్ మూర్తి, టైల్స్ బాబి, బీసీ నాయకులు శ్రీనివాసరావు, వినకొండ అమ్మాజీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేనకి అధికారం లేకపోతేనే ప్రజలకు ఇంత సేవ చేస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ప్రజలకు మరింత సేవలు చేయడానికి ముందుకు వస్తుందన్నారు. అందరూ అర్థం చేసుకోని ప్రజా ప్రభుత్వం కావాలంటే వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్ధులని అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com