Logo
Date of Publish : 30 November 2022, 4:01 pm
Editor : Sake Naresh

ప్రజలలో జనసేనకు విశేష స్పందన : మాకినీడి శేషుకుమారి

పిఠాపురం ( జనస్వరం ) : రాష్ట్ర అభివృద్ధికై.. జనసేనకు ఒక్క చాన్స్ ఇవ్వండి కార్యక్రమంలో భాగంగా నాల్గవ రోజు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి 22వ వార్డు కత్తులగూడెంలో ఆమె పర్యటించారు. స్థానికుల సమస్యలు, వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేనకు పిఠాపురంలోనే గాక రాష్ట్ర మొత్తం విశేష స్పందన లభిస్తుందని ఆన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మూడున్నర సంవత్సరాలు పైగా ఈ ఇబ్బందులు అనుభవించిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన చూస్తున్నారని ఇది జనసేన గెలుపుకు శుభసూచకమని ఆమె అన్నారు. స్థానిక ప్రజలు వారికి ఉన్న డ్రైనేజీ సమస్యలు, వీధి కులాయి సమస్యలు వివరించారన్నారు. వాటిని జనసేన ప్రభుత్వం వచ్చిన రోజుల్లోపు పరిష్కారం చేస్తామన్నారు. ఇల్లు లేని వారికి కాకుండా నాలుగైదు ఇల్లు ఉన్నవారికి ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందన్నారు. ప్రచారానికి వెళ్తుంటే జనసేన సిద్ధాంతాలు మాకంటే ముందు ప్రజలే మాకు వివరిస్తున్నారు, ఇది చూస్తుంటే జనసేన ప్రజలను పవన్ కళ్యాణ్ గారి సుపరిపాలన వైపు ఎంతల చేస్తున్నాయో అర్థమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, బుర్రా సూర్య ప్రకాష్, మేళం బాబి, కారపురెడ్డి మణికంఠ, సింగన్న, దేశీరెడ్డి సతీష్, యంద్రపు శ్రీనివాస్, మురళి కృష్ణ,మురాలశెట్టి సందీప్, షారుక్, చందు, ప్రకాష్, వినయ్, కసిరెడ్డి నాగేశ్వరరావు, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com