Logo
Date of Publish : 24 April 2021, 6:35 am
Editor : Sake Naresh

జనసేనాని ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ ఆంజనేయస్వామికి కొలసాని లక్ష్మీ దంపతులచే ప్రత్యేక పూజలు

          జనంమెచ్చిన నాయకుడు... జనహృదయనేత.. జనసేనాధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కరోనా మహమ్మారి బారినుంచి త్వరగా కోలుకోవాలని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని నూతలపాడు గ్రామానికి చెందిన జనసేనపార్టీ నాయకులు శ్రీమతి కొలసాని లక్ష్మీ, శ్రీనివాసరావులు స్థానిక శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ గారి పేరిట ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేయించారు. అంజనీమాత సుతునికి ఆపదలు రాకుండా చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని వాయుపుత్రుని వారు ప్రార్థించారు. ఈసందర్భంగా శ్రీ స్వామి వారికి ప్రత్యేక ఆకు పూజలు, 11 కొబ్బరి కాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావు దంపతులతో సహా నూతలపాడు జనసైనికులు, గ్రామస్థులు అందరూ శ్రీ ఆంజనేయ స్వామి వారిని, సకల దేవతలను వారు మొక్కుకున్నారు. ఈకార్యక్రమంలో మెగాఫ్యామిలీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వెంకటేష్, వంశీకృష్ణ, నాగపవన్ కుమార్, రాజేష్ తదితరులతో పాటు పలువురు మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com