కళ్యాణదుర్గం, అక్టోబర్ 14, (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండల జనసేన నాయకుల ప్రత్యేక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశం జనసేన కళ్యాణదుర్గం ఇంచార్జ్ బాల్యం రాజేష్ సమక్షంలో జరిగింది. సమావేశంలో రాబోయే మండల కమిటీల ఏర్పాటు, గ్రామ కమిటీల బలోపేతం, క్రియాశీలక సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలపరచే దిశగా నాయకులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం కంబదూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీలకు సంబంధించిన నివేదికను మండల నాయకులు ఇంచార్జ్ బాల్యం రాజేష్‌కు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు మరింత చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కంబదూరు మండల జనసేన ముఖ్య నాయకులు వడ్డే శ్రీనివాసులు, వెంకటేష్, రామ్ ప్రసాద్, మహేష్, నరసింహమూర్తి, శ్రీకాంత్, జగదీష్, నవీన్ కుమార్, నాగన్న, నేతి భీమరాయుడు, నర్సింహులు, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.