Logo
Date of Publish : 30 November 2025, 9:37 am
Editor : Sake Naresh

దేవగుడి చిత్ర టీంతో విద్యార్థుల ప్రత్యేక ఇంటరాక్షన్

తిరుపతి, నవంబర్ 29, జనస్వరం : విశ్వం హైస్కూల్‌లో శనివారం 'దేవగుడి' సినిమా బృందం నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమం విద్యార్థుల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని రేపింది. సినిమా యూనిట్ నుండి హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ, దర్శక–నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, ఇతర చిత్రబృంద సభ్యులు విద్యార్థులతో అనుభవాలు పంచుకున్నారు. హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ, “విశ్వం స్కూల్ పిల్లల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ చాలా అరుదు. కష్టానికి విలువ ఇచ్చే పిల్లలు జీవితంలో ఎక్కడికైనా ఎదగగలరు” అని అన్నారు. హీరోయిన్ అనుశ్రీ విద్యార్థులతో మాట్లాడుతూ, “మీ పాజిటివ్ ఎనర్జీ చూసి చాలా హ్యాపీగా ఉంది. చదువుతో పాటు కళలు, సృజనాత్మకత కూడా ఎంతో ముఖ్యం” అని చెప్పి అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “చిన్నారుల్లో సినిమా రంగంపై అవగాహన పెంచడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం” అని అన్నారు. “విశ్వం విద్యాసంస్థలు విద్యతో పాటు విద్యార్థులలోని ప్రతిభ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఎల్లప్పుడూ ముందుంటాయి. ఇలాంటి సినీ–సాంస్కృతిక ఇంటరాక్షన్‌లు పిల్లల ఆలోచనలకు కొత్త దిశను ఇస్తాయి. దేవగుడి సినిమా బృందం మా విద్యార్థులతో గడిపిన సమయం వారికి ప్రేరణగా నిలుస్తుంది” అని అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com