విజయనగరం ( జనస్వరం ) : చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం.. కొండగండ్రేడు, ముద్దాడ గ్రామం, మరియు పరిసర గ్రామాల్లో అకాల వర్షాలు వలన తీవ్రంగా మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను జనసేన పార్టీ జిల్లా నాయకులు,నియోజకవర్గ నాయకులు ఆదాడ మోహనరావు, విసినిగిరి శ్రీనివాసరావు,దంతులూరి రామచంద్ర రాజు,సంతోష్, త్యాడ రామకృష్ణారావు(బాలు) పరామర్శించారు. జనసేన నాయకులు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న పంటకోసం అప్పుచేసి ఏకరాకు సుమారు యాబై వేలు ఖర్చుచేసారని,ఒక్క గర్ల మండలంలోనే సుమారు రెండు వందల ఎకరాలు మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, వీరికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరుపున అండగా నిలుస్తామని, ఎకరాకు ఏబైవేలు రూపాయలు జనసేన తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రైతే దేశానికి,రాష్ట్రానికి వెన్నుముక అని చట్టశబల్లో ప్రగద్భాలు పలికే ఈ వైసీపి నాయకులకు ఈ రైతు బాధలు కనబడట్లేదా అని దుయ్యబట్టారు. ఈ అకాల వర్షాలు పడి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యవసాయ అధికారులు,ప్రజా ప్రతినిధిలు పరామర్శ చేయక పోవడం భాధాకరమని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే వరకు జనసేన పార్టీ తరుపున అండగా నిలిచి, పోరాడతామని తెలిపారు.