కొల్లాపూర్, (జనస్వరం) : కొల్లాపూర్ నియోజకవర్గము, పెంట్లవెల్లి మండలంలో జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కొల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బైరపోగు సాంబ శివుడు హాజరై మండల పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామినీ దర్శించుకొవడం జరిగింది. అనంతరం కార్యకర్తలకు జనసేన పార్టీ బలోపేతం పట్ల దిశ నిర్దేశం చేశారు. పెంటవెల్లి మండలంలో ప్రజల సమస్యలను పరిష్కరించే భావంగా జనసేన పార్టీ కార్యకర్తలను పనిచేసి కాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేసే ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలకు పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందు తరానికి ఉన్న పార్టీ జనసేన పార్టీ రాజకీయ తెలియజేయడంలో కీలక పాత్ర పోషించాలి అని కార్యకర్తలు అలాగే పార్టీ యొక్క ఉద్దేశాన్ని పార్టీ ఆవిర్భవించిన అప్పటినుంచి పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళుతున్న అనేక సందర్భాల్లో పెంట్లవెల్లి మండల కేంద్రంలో కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ఎత్తుగడ్డలతోటి రాజకీయం లబ్దికోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తున్న రాజకీయ పార్టీలను ప్రజల ద్వారా పొందబెట్టే విధంగా కార్యచరణ ఉండాలి. ఆ దిశగా ఇలాంటి రాజకీయ వ్యవస్థను రాజకీయ పార్టీలను ప్రజల నుంచి దూరం చేసే విధంగా ప్రజలకు దగ్గరై ప్రజా పాలన ప్రజలు కోరుకునే విధంగా ఉండే పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాబట్టి పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజక వర్గంలో భైరపోగు సాంబశివుడు జనసేన పార్టీ కార్యకర్తలతో పెంట్లవెల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించారు. ఈ కార్యక్రమంలో రవితేజ, నాగరాజు, ఎజ్జు, ఆంజనేయులు, రెడ్డిరవి, రెడ్డి, రమేష్, భూపతి, శివ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com