
ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉరవకొండలోని స్థానిక అంబేద్కర్ నగర్ నందు సిసి రోడ్డు సమస్య మరియు డ్రైనేజీ సమస్య రోడ్డుపై చెత్తను సమస్యను పరిష్కరించాలని నియజకవర్గం ఇంచార్జ్ గౌతమ్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సమస్యను అతి త్వరగా పరిష్కారం చూపించావలసిందిగా కోరడమైనది. మండల అధ్యక్షులు చంద్రశేఖర్, 9వ వార్డు సభ్యుడు రామాంజినేయులు మాట్లాడుతూ రోడ్డు కి ఇరువైపులా ఆగిపోయిన సీసీ రోడ్డు సమస్య డ్రైనేజీ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, 9వ వార్డు సభ్యుడు రామాంజినేయులు టీడీపీ నాయకులు గోపాల్, రవి వర్మ జనసేన నాయకులు రాజేష్, రమేష్, మణీ కుమర్, మల్లేష్ గౌడ్,ధనంజయ, భీమ, బోగేస్,కుమార్, అభిరామ్, అనిల్ కుమార్, చరణ్, వంశీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు .