Logo
Date of Publish : 05 May 2022, 3:21 pm
Editor : Sake Naresh

కోవెలకుంట్లలో తాగునీటి సమస్యను పరిష్కరించండి : జనసేన నాయకులు

    కర్నూలు ( జనస్వరం ) : కోవెలకుంట్ల పట్టణంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సమస్యలను పరిష్కరించాలని జనసేన నాయకులు అధికారులను కోరారు. జనసేన నాయకులు మాట్లాడుతూ కోవెలకుంట్లలో త్రాగునీరు 8 బోర్లు, ఒక డైరెక్ట్ పంపింగ్, RWS మరియు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా సరఫరా అవుతుంది. అయితే మినరల్ వాటర్ ప్లాంట్స్ లో నీటి సుద్ధి సరిగా చేయకపోవడం అలాగే కొన్ని ప్లాంట్స్ చెడిపోపడం వల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా పట్టణంలోని దాసరి వీధి, సుంకులమ్మ దేవాలయం సమీపంలో, ఇందిరమ్మ కాలనీలో అలాగే మరికొన్ని చోట్ల వాటర్ ప్లాంట్స్ లేకపోవడం వల్ల త్రాగు నీటి కోసం ప్రజలులు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ ప్లాంట్ నుంచి వచ్చే నీటిని కొని వినియోగించుకుంటున్నారు. త్రాగు నీటి సరఫరాకు చాలా వనరులు ఉన్నప్పటికీ ప్రైవేట్ ప్లాంట్స్ ద్వారా నీటిని కొనుక్కోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. మినరల్ వాటర్ ప్లాంట్స్ లో సరిగా నీటిని శుద్ధి చేయకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్లాంట్స్ దగ్గర టైల్స్ ఏర్పాటు చేయకపోవడంతో కలుషితమైన వాతావరణం నీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో త్రాగు నీటి విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జనసేన నాయకులు గ్రామ పంచాయతీ ఈఓ బాలఆంజనేయులు, ఉప సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నబాబు, నాయకులు పత్తి సురేష్ బాబు, గురప్ప, బోధనం ఓబులేసు, నాగప్రసాద్, చిన్న కిట్టు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com