ఉరవకొండ ( జనస్వరం ) : పట్టణంలోని ఈశ్వరి మాత ఆలయం ముందు విపరీతమైన డ్రైనేజీ సమస్య ఉంది.పక్కనే ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీ నుంచి మురుగునీరు ఈశ్వరి మాత ఆలయం ముందు నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ నీరు మొత్తం రోడ్లపైకి వచ్చి విపరీతమైన దుర్గంధం వెదజచల్లుతుందని జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పక్కనే మహేశ్వరి పాఠశాల కూడా ఉంది. చిన్నపిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డ్రైనేజీ నీటిలో పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, రమేష్, మణి, బోగేష్, రూపేష్, చందు తదితరులు పాల్గొన్నారు.