ఆళ్లగడ్డ, (జనస్వరం) : సిరివేళ్ళ మండల జనసేన నాయకులు గ్రామంలోని గతుకులు పడిన రోడ్ల మీద మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో జనసేన పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు మైలేరి మల్లయ్య గారు మాట్లాడుతూ నిన్న YCP నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సిరివేళ్ళ గ్రామములో YCP నాయకులు చేస్తున్న అభివృద్ధిని జనసేన నాయకులు అడ్డుకుంటున్నారు అని ఆరోపణలు చేశారు. కోడలు పిల్లలని కంటాను అంటే అత్త వద్దని చెప్తుందా మీరు అభివృద్ధి చేస్తే మేము వద్దంటామ, మీరు సిరివేళ్ళ గ్రామములో చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద బహిరంగ చర్చకు జనసేన పార్టీ సిద్ధం మీరు సిద్ధమా! గత కొన్ని సంవత్సరాలుగా సిరివెళ్ల గ్రామ సమస్యలమీద జనసేన నాయకులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ పంచాయితీ సెక్రటరీ సుబ్బారాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన కూడా YCP నాయకులు చెపితేనే మీ సమస్యను పరిష్కరించుతాము అని చెప్తున్నా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయితే పెద్ద సంఖ్యలో గ్రామ సచివాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. విష జ్వరంతో చనిపోయిన బాలుడి మరణాన్ని డబ్బుతో వెల కట్టిన YCP నాయకులు తిరిగి ఆ తల్లి కీ కొడుకును తేగలరా? ఆ తల్లి గుండె కోత తీర్చగలరా? డ్రైనేజి సమస్యలని తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కరం దిశగా ప్రభుత్వం పని చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్, బావికాడి గురప్ప, అడవాల రాజేష్, ముడిమేల అంజి, రాజారామ్, జమాల్ భాష, విశ్వనాథ్, ఆంజనేయులు, నర్సింహారావు, సాగర్ తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com