
రాజోలు ( జనస్వరం ) : అమరావతి రైతులు అమరావతి నుండి అరసవెల్లి వరకూ రాజధానిగా అమరావతి కొనసాగాలని, ఏకైక రాజధాని కొనసాగాలని పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర రాజోలు మీదుగా వెళ్తోంది. జనసేనపార్టీ మద్దతుగా జనసేన నాయకులు, జనసైనికులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొన్నల ప్రభ, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణ భాస్కరరావు, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, ఉండపల్లి అంజి, పోలి శెట్టి గణేష్, చింత స్వామి, గంట్రోతు కిరణ్, మురళి, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.