Logo
Date of Publish : 28 February 2022, 4:44 pm
Editor : Sake Naresh

కాకరాపల్లి థర్మల్ మృతులకు టెక్కలి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

    టెక్కలి, (జనస్వరం) : సంతబొమ్మాలి మండలం పోతినాయయుడు పేట గ్రామంలో 2011 ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన పోలీసు కాల్పులలో మరణించిన ఉద్యమకారులకు టెక్కలి జనసేనపార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కణితి కిరణ్ మాట్లాడుతూ జీవో నేoబర్ 1108ని వెంటనే రద్దు చెయ్యాలని ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులను భేషరుతుగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి నాడు టెక్కలిలో 2018 డిసెంబర్ 21 న ఈ ప్రాంత పర్యటనలో ఈ ప్రాంత వాసులకు ఇదే హామీ ఇచ్చారని, నేడు వారు అధికారంలోకి వచ్చి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు హామీలు నెరవేర్చలేదని డిమాండ్ చేశారు. తమ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1108 జీవోను రద్దు చేసి, ఉద్యమ కారులపై పెట్టిన కేసులను కూడా రద్దు చేస్తామని కణితి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపి అభ్యర్ధి మెట్ట రామారావు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి పుష్కర కాలం అవుతున్న ఈ సమస్య పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరం అని, ప్రభుత్వం వెంటనే స్పందించి 1108 జివోను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు, ఎంపీటీసీ అభ్యర్ధులు, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com