హైదరాబాదు ( జనస్వరం ) : మే డే సందర్భముగా KPHB కాలనీ 114 డివిజన్ అధ్యక్షులు కొల్లా శంకర్ జనసైనికులతో కలసి టిఫిన్ విత్ సఫాయి కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలో గల జిహెచ్ఎంసి సఫాయి కార్మికులతో కలసి జనసైనికులు టిఫిన్ తీసుకున్నారు. ఈ సందర్భముగా కొల్లా శంకర్ మాట్లాడుతూ నిత్యం మన పరిసరాలను శుభ్రం చేస్తూ మనల్ని మంచి వాతావరణంలో ఉంచే ఈ సఫాయి కార్మికుల సేవలను మరువలేమని వారు చేసే ఈ సేవతోనే మనమందరము ఆరోగ్యంగా ఉంటున్నామని అన్నారు. కార్మికులకు అండగా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ఇరు రాష్ట్రాల్లో ప్రజలతో మమేకమవుతూ ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమములో బాలాజీ నగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు తుమ్మల మోహన్ కుమార్, కేపీహెచ్ బీ 114 డివిజన్ వైస్ ప్రెసిడెంట్ చరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి( కేబుల్ ) శ్రీనివాస్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com