పిఠాపురం ( జనస్వరం ) : గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో స్కూల్ రోడ్లు కూడా పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నపం చేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వన్నెపూడి గ్రామ జనసైనికులు తమ సొంత ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే రోడ్డు మార్గంలో గ్రావెల్ తోలించి పాఠశాల రోడ్డు మార్గం వేసి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. జనసైనికులు తలపెట్టిన ఈ శ్రమదానానికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకీనీడి శేషుకుమారి భాగాస్వామ్యలుగా అయ్యారు. స్కూల్ పిల్లలు నడిచే రోడ్డుకూడా వేయలేక పోయిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం తలపెట్టడం జరిగిందన్నారు. నాడునేడు కార్యక్రమంలో స్కూల్ అభివృద్ధికి లక్షలు సొమ్ము రిలీజ్ చేసుకుని పైపైన మెరుగులు దిద్ది సొమ్ముని దుర్వినియోగం చేసారుగాని రోడ్డును నిర్మాణం చేయలేక పోయారన్నారు. తదుపరి స్కూల్ సందర్శించిన ఎస్ కుమారి పౌష్టికాహారంపై ఉపాధ్యాయులను ఆరా తీసారు. పెరిగే పిల్లలకు సరైన ఆహారం అందించడంలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, మరణించిన కౌలు రైతుల కుటుంబానికి అండగా ఉంటున్న కార్యక్రమం కోసం ప్రజలకు తెలియజేయాలని జనసైనికులతోఅన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, PSN మూర్తి, దొడ్డిపట్ల గణేష్, దొడ్డిపట్ల రాంబాబు, పచ్చిపాల శివ, పచ్చి పాల దత్త, బొల్లు రాజా, మొయిళ్ళ శివగంగా, గొల్లపల్లి కృషర్జున, దొడ్డిపట్ల వీరకృష్ణ, మేళం దత్త, యర్రా సతీష్, డేగల స్వామి, అడబాల వీర్రాజు, గ్రామస్తులు, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.