
గన్నవరం ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పి.గన్నవరం నియోజకవర్గం యర్రంశెట్టివారిపాలెం ప్రాంత పరిధిలో లంక గ్రామాలకు వరద నేపధ్యంలో చుట్టుముట్టిన వరద నీటితో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రజలకు గుప్పెడు మెతుకులు కరువయ్యాయి. బాధిత ప్రజలకు సకాలంలో ఆహార పొట్లాలను పంపిణీ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారనే ఆవేదన ప్రజల నుండి వ్యక్తమవుతుంది. ఈ విపత్తును చూసి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యర్రంశెట్టివారిపాలెం గ్రామ ఉపసర్పంచ్ నారిన సతిపండు మరియు సుంకర కొండ సహాయంతో సర్పంచ్ మరియు జనసైనికులు ఆధ్వర్యంలో రెండోవ రోజు లంకల గన్నవరం గ్రామంలో ముంపు ప్రాంతాల్లో ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది.