గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక బైపాస్ రోడ్డు రోడ్లు గుంతల మయం కావడంతో ప్రయాణికులు మరియు వాహనదారులు గుంతలలో పడి ఇబ్బంది పడడంతో అక్కడ స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి గాంధీ జయంతి పురస్కరించుకొని ఆ గుంటల దగ్గర మోకాలు మీద నిరసన కార్యక్రమం చేసి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ గుడివాడ పట్టణ అభివృద్ధి కొరకు ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదని ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సమస్యల మీద పోరాడుతున్నామని అదేవిధంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ బాపూజీని స్మరించుకొని గుడివాడ పట్టణ బైపాస్ రోడ్ లో శాంతియుతంగా గుంతలలో మోకాలు మీద నిరసన కార్యక్రమం తెలియజేసారు. ఆ బాపూజీకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ప్రజల ప్రాణాలు పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం అని ప్రతి వాహనదారుడు ప్రభుత్వానికి టాక్స్లు కడితే ఆ టాక్స్ వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వం అ పథకాలు ఈ పథకాలకు బటన్ నొక్కి ఆ డబ్బులు వాడుకుంటుందే తప్పితే రోడ్లు వ్యవస్థ పట్టించుకోవట్లేదని ఆవేదన తెలియజేశారు. ఆర్ అండ్ బి అధికారులకు తెలియజేస్తుంటే వేస్తాం వేస్తాం అంటున్నారు తప్పితే కనీసం ఒక తట్ట మట్టి కూడా వెయ్యకపోవడం చాలా దౌర్భాగ్యం అని తెలియజేశారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప దివిలి సురేష్ కే కిరణ్ చరణ్ తేజ్, శివ, చరణ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com