
గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ జన సైనికుల ఆధ్వర్యంలో వరల్డ్ పవనిజం డే సందర్భంగా యాచకులకు పేదలకు మరియు ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ గుడివాడ పట్టణంలో సేవా కార్యక్రమాలు భాగంగా మా అభిమాన నటులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినీ ప్రస్థానం చేసిన రోజు అక్టోబర్ 11 ఆ రోజున మా అభిమానులంతా కలిసి వరల్డ్ పవనిజం సేవా సంస్థ ఏర్పాటు జరిగిందని అన్నారు. సమాజానికి దేశానికి పనిచేయడమే నిజమేనా జీవితమని చెప్పిన మాటల స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో ప్రజలకు దగ్గరగా ఉండి సమస్యల మీద మరియు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అలాంటి మహనీయుడుకు మేమందరం కార్యకర్తల అవడం చాలా గర్వంగా ఉందని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ వరల్డ్ పవనిజం డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, మట్టా జగదీష్, శివ చరణ్, తేజ్ కిరణ్, దివిలి, సురేష్, చరణ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు.