నెల్లూరు ( జనస్వరం ) : మిచౌంగ్ తుఫాన్ వల్ల గత రాత్రి నడుము లోతు నీటిలో ఇంట్లో ఇరుక్కుపోయిన గిరి పుత్రులకు జనసేన పిలుపుతో వెజిటబుల్ బిరియాని, నీరు బాటిల్స్, బ్రెడ్డు పాకెట్ అందించిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో చర్చిన తరువాత మాట్లాడుతూ పరమేశ్వరి నగర్ అంతా కూడా పది అడుగుల నీటితో మునిగిపోయి ఆ నీరంతా కూడా వెళ్లేందుకు గత ఐదు సంవత్సరాలు ముందు ఇక్కడ తూము నిర్మించారు. నగరం గుండా పెద్ద కాలువలు గుండా వెళ్లాల్సిన నీరంతా కూడా కాలవలు దురాక్రమంగా కావడం వల్ల అటుపక్క ప్రవహించకుండా నీరు మొత్తం వీరి ఏరియా కి వచ్చి వావ వచ్చినప్పుడల్లా మా ఏరియా ముంపు కి గురి అవుతుంది. వైసీపీ కార్పొరేటర్లు నీట మునిగినప్పుడల్లా వచ్చి కొంత మందికి ఆహర పొట్లాలు ఇవ్వడం కాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిహరం చూపోవాల్సిందిగా వారు కోరారు. ఈ సమస్య కేవలం ఎన్నో సంవత్సరాలుగా దేవునికి సేవ చేస్తున్న ఈ గిరి పుత్రులది మాత్రమే కాదు. నెల్లూరు నగర ప్రధాన కాలువైనటువంటి గచ్చి కాలువ, ఉయ్యాల కాలువ దురాక్రమణకు గురై నీరు వాటి కుంటే గుండా ప్రవహించక ఎక్కడ నీరు అక్కడే ఉండిపోయి నగరం మొత్తం నీటితో నిండిపోతుంది. స్థానిక నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తగు చర్యలు తీసుకొని రాబోయే విపత్తులను దృష్టిలో ఉంచుకొని కాలవల దురాక్రమణలు తొలగించి చినుకు పడితే నీటి ఎద్దడి కాకుండా నగరాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది. తుఫాన్ బాధితులకు జనసైనికులు అఅందరూ కూడా తమవంతు సహాయకారిగా నిలబడ్డారు. ఎక్కడైనా ఆహారం, నీరు అందక ప్రజల ఇబ్బందులో ఉంటే తమ దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు.