సవరగూడెం గ్రామంలో పేదరికాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని గన్నవరం నియోజకవర్గం సవరగూడెం గ్రామంలో పేదరికాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ.చేయడం జరిగింది. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా గ్రామం లోని నిరుపేదలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు మందులు, కూరగాయలు అందించడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా పనులు లేక చాల మంది అనేక రకాలుగా వారి జీవనం సాగించటానికి ఇబ్బంది పడుతున్నారని, మరీ సవరగూడెం గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు పనులు లేక తినటానికి ఏమి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి తమ వంతుగా సహాయం చేయటం జరిగిందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్, జ్యోతి స్వరూప్, దినేష్, దుర్గా ప్రసాద్, రావేంద్ర కుమార్, సూర్య, రాజా, భరత్, చంటి, శ్రీనివాసులు, ఆంజనేయులు, శంకర్, బాలాజీ, నవీన్, రాము, జాగారావు, ఆంజనేయులు, యువ, మూర్తి, బాల, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com