పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలంలో తాటిపర్తి గ్రామంలో కోదండరామ పెద్ద చెరువులో అక్రమంగా తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. ఈనెల 11 వ తారీకున యంత్రాలు లారీల ద్వారా తరలింపు ప్రారంభించారు. తాడిపర్తికి సంబంధించిన పలువురు రైతులు జనసేన పార్టీని అండగా ఉండాలని కోరగా రైతులు, నాయకులు, జనసైనికులు అడ్డుకోవడం జరిగింది. దాంతో అధికార పార్టీ నాయకులు కొంతమంది అనుచరులతో బెదిరింపు ఫోన్లు, అలాగే స్టేషన్ కి రమ్మని కూర్చోపెట్టి రకరకాల ప్రయత్నాలు బెదిరింపులు చేశారు. ఈ విషయం మండల అధ్యక్షులు అమరాది పల్లి రామకృష్ణ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్రమంగా తవ్వకాలు నివారించడం వల్ల భూగర్భం కోల్పోతోందని, అలాగే అక్కడ ఉన్న పంట పొలాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారని తెలియజేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి, ఉభయ గోదావరి జిల్లాల వీర మహిళా విభాగం కన్వీనర్ చల్లా లక్ష్మి, నాయకులు జనసైనికులుతో కలిసి మట్టి తవ్వకాలు జరుగుతున్న చెరువును పరిశీలించి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడటం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు దుర్గేశ్ మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఇసుక మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, ఈ గోయ్యలు తాడిచెట్టు లోతు ఉంటుందని, అంతలోతు ఉండడం వలన ఇప్పటికే సుమారుగా 8 మంది ఈ చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లుగా గ్రామస్తులు ద్వారా తెలుసుకున్నామని, ప్రమాదాలేకాక చెరువు నీరుని బోరు సహాయంతో తౌడుకొనేలా పరిస్థితి ఉందని, మరికొంత కాలానికి డ్రిప్ ల మిషన్ ద్వారా తీసుకోనే పరిస్థితి రాకుండా ఇప్పటికైన ప్రజల గోడు విని త్రవ్వకాలు ఆపాలని, లేదంటే జనసేన వాడిని చూస్తాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, జిల్లా కార్యదర్శులు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, వెన్న జగదీష్, అరవ వెంకటాద్రినాయుడు,యేలేశ్వరపు భాను,సమినీడి అప్పారావు, దాసం కొండబాబు, అడబాల వీర్రాజు, తావతి చక్కరరావు, మొగలి శ్రీనివాస్, గారపాటి శివ కొండరావు, సామన్న దొర, రంపం సత్తిబాబు, మణికంఠ, కుర్ర నాగు, గంగాధర్, గణేష్ నాయుడు, స్వామీజీ, ఆకుల వెంకన్న, గాడిదల బుజ్జి,రామచంద్రరావు, పుణ్య మంతుల బాబురావు, దొడ్డి దుర్గాప్రసాద్, బుర్రా సూర్య ప్రకాష్, రాసం శెట్టి కన్యాకర్రావు, వినుకొండ అమ్మాజీ, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com