Logo
Date of Publish : 25 October 2023, 9:20 pm
Editor : Sake Naresh

సామాజిక న్యాయo యాత్ర కేవలం ఓట్ల కోసమే : శశిరేఖ

   అనంతపురం ( జనస్వరం ) :  రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతో మరొక్కసారి రాష్ట్ర ప్రజలను మోసంచేయడానికి బస్సు యాత్ర పేరుతో ముందుకొస్తున్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ లను ఓట్ల కోసం వాడుతున్నారు తప్ప ఉన్నతమైన పదవులు మాత్రం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి నిధులు లేని కార్పొరేషన్లను మాత్రం ఎస్సీ, ఎస్టీ , బీసీ మైనార్టీలకు ఇచ్చారని జనసేన మహిళా నాయకురాలు శశిరేఖ మండిపడ్డారు. ఎస్సీ లకి సంబంధించి విదేశీ విధ్య పథకం ఏమైంది...? భూములు లేని దళితులకు భూ పంపిణీ పథకం ఏమైంది...? వైసీపీ ప్రభుత్వానికి సామాజిక న్యాయ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేయడానికి కనీసం అర్హత కూడా లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఏమిచేయని వైసీపీ ప్రభుత్వం ధైర్యంగా ముందుకు రాలేక బస్సు యాత్ర పేరుతో రోడ్లపైకి వస్తున్నారు. జగన్ రెడ్డి రోడ్లపైకి రావాలంటే పరధాల మధ్య వస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే లు గడప గడపకు అని ప్రజలమధ్య కోస్తే ఎక్కడికక్కడ ప్రజలు నిలదీశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి విలువలేదు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ ప్రాంత కుటుంబాలన్నీ ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. వర్షాలు సరిగా లేక పంటలన్నీ ఎండిపోయి రైతులు ఆత్మహత్య శరణ్యమని బాధపడతా ఉంటే వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయకుండా రాష్ట్రంలో షికారుకెళుతున్నట్లు వైసిపి నాయకులు యాత్రకు వెళుతున్నారు. రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం చేయాలని ఆదుకోవాలని లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని జనసేన పార్టీ మహిళా నాయకురాలు శశిరేఖ తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com