Logo
Date of Publish : 07 March 2026, 9:35 am
Editor : Sake Naresh

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి : ఉండవల్లి గాంధీబాబు

పోలవరం, మార్చి 3, (జనస్వరం) : మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఉండవల్లి గాంధీబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని సమస్త మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ వ్యవస్థలో మహిళలు స్తంభంలా నిలబడటమే కాకుండా దేశ నిర్మాణం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి “మహిళా రైతుల సంవత్సరం”గా ప్రకటించడం ఎంతో ప్రాధాన్యమైన నిర్ణయమన్నారు. గ్రామీణ మహిళలకు వనరులపై హక్కులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆడపిల్లల పుట్టుక, విద్య, అభివృద్ధికి సమాజం ప్రాధాన్యం ఇవ్వాలని, బాల్య వివాహాలను అరికట్టి మహిళలపై జరిగే అన్యాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు తమ ప్రతిభతో ఎదగడానికి సమాజం, ప్రభుత్వం కలిసి సహకరించినప్పుడే దేశ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com