Search
Close this search box.
Search
Close this search box.

వంగవీటి మోహన్ రంగా పేరు మీద స్మృతి వనం, ఒక పథకానికి పేరు ఏర్పాటు చేయాలి

– రంగా కుటుంబంపై వివక్ష చూపుతున్న సీఎం జగన్.
– రాధాకృష్ణని రాజకీయంగా ఉపయోగించుకుని వదిలేసినప్పుడు, రెక్కీ నిర్వహించినప్పుడు కొడాలి నాని లాంటి వైసిపి నాయకులు ఎందుకు అండగా నిలవలేదు.
– రాజకీయ లబ్ధి కోసమే ఊసరవెల్లి ప్రకటనలు నేడు వైసిపి నాయకులు చేస్తున్నారు.
– వెల్లంపల్లి శ్రీనివాస్ తడిగుడ్డ లేకుండా గొంతులు కోసే వ్యక్తి
       విజయవాడ, (జనస్వరం) : వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ  ఇంచార్జి పోతిన వెంకట మహేష్, బందర్ రోడ్ లోని రంగా విగ్రహానికి వంగవీటి రాధాకృష్ణతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రంగా మరణించిన 34 సంవత్సరాల తర్వాత కూడా కోట్లాదిమంది హృదయాల్లో నేటికీ కొలువై ఉన్నారని బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారని, ఇల్ల పట్టాల కోసం లాకప్ దత్తుల పైన అలుపెరగని ఉద్యమలు చేసినందువల్లే నేటికీ వారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలబడ్డారని రంగా పేరు తలవకుండా రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి విజయం సాధ్యపడదని రంగా పేరును ఒక జిల్లాకు ప్రకటించాలని కోరిన సీఎం జగన్, రంగా కుటుంబం పై వివక్ష చూపారని ఎన్నికలకు ముందు రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, నేడు అవసరం తీరాక కనీస స్పందన లేదన్నారు. నిజంగా జగన్ కి చిత్తశుద్ధి ఉంటే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా స్మృతి ఇవ్వడం ఏర్పాటుతో పాటు ఏదో ఒక పథకానికి వారి పేర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొంతమంది వైయస్ఆర్సీపీ నాయకులు రాధాకృష్ణ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని రాధాకృష్ణ కోరుకుంటే పదవులు డబ్బు వారి వెనక నడిచి వస్తాయని రాజకీయ లబ్ధి పొందేలా మాట్లాడుతున్నారని, మరి 9 సంవత్సరాలు పాటు వైఎస్సార్సీపీకి సేవ చేస్తే 2019లో రాధాకృష్ణకి అసెంబ్లీ సీటు కేటాయించనప్పుడు కొడాలి నాని లాంటి నాయకులు ఏమయ్యారని, 2022లో రెక్కీ నిర్వహించినప్పుడు కనీసం స్పందించని ఈ నాయకులు నేడు రాజకీయంగా లబ్ధి పొందేందుకే మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని, ఇటువంటివారిని వంగవీటి రంగా అభిమానులు అనుచరులు, అదేవిధంగా రాధాకృష్ణ అభిమానులు ఇటువంటి ఊసరవెల్లి నాయకులకి రాబోయే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెప్పి తీరుతారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా వివిధ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న పోతిన వెంకట మహేష్. నెహ్రూ బొమ్మ సెంటర్ లో 51వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు బత్తుల వెంకటేష్, పోతిన శివ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 750 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ నెహ్రూ బొమ్మ సెంటర్లో 2020 సంవత్సరంలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని చేయనివ్వకుండా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అనేక ఇబ్బందులకు గురి చేశారని నేడు ఎన్నికలు సమీపిస్తున్నందున రంగా విగ్రహానికి పూలమాలలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని డ్రామాలాడుతున్నారని, అదేవిధంగా రాధాకృష్ణపై రెక్కీ నిర్వహించిన వ్యక్తులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన దుర్మార్గుడని ఇటువంటి వ్యక్తులను రాజకీయాల నుండి పూర్తిగా సమాజం నిర్మూలించకపోతే తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర కాపు సంఘం అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు అడ్డూరి శ్రీరామ్, జనసేనపార్టీ నాయకులు పులి చేరి రమేష్, స్టాలిన్ శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిన బేస్ కంటేశ్వరుడు, బిజెపి నాయకులు బాగవల్లి శ్రీధర్ బీసీ నాయకులు పట్నాల హరిబాబు , తాత్రాజుల నరేష్, డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు, షేక్ అమీర్ భాష, తిరుపతి సురేష్, ఆకుల రవిశంకర్, బుద్ధన ప్రసాద్ ప్రముఖ న్యాయవాది పెళ్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 48వ డివిజన్ లో చిట్టినగర్ సెంటర్ వద్ద 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 300 మందికి ఆపిల్ ఆరెంజ్ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేవిన నాగరాజు, పల్లి శెట్టి ఉమా, తమ్మిన రఘు, సాంబ, నాగరాజు, చిన్న, నాని తదితరులు పాల్గొన్నారు. చెరువు సెంటర్ వద్ద 44వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 250 మంది పేదలకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెపు సురేష్, గంజి పవన్, తోట కోటి, స్టాలిన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కుమ్మరిపాలెం సెంటర్ వద్ద 38 మరియు 39వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 300 మంది పేదలకు యాపిల్ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గన్ను. శంకర్, దారా. రాము, భరత్, నాని, తదితరులు పాల్గొన్నారు. 47 డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ కార్యాలయంలో వంగవీటి రంగా వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ వంగవీటి రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానాయకుడు అని కొనియాడారు. ఆయన 7 ఏళ్ల రాజకీయ జీవితంలోనే ఎంతో ఎత్తు ఎదిగి, ప్రజలకు చేరువ అయ్యారని తెలియజేశారు. ప్రజలకు మంచి చేస్తే ఏళ్లు గడిచినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way