తూర్పుగోదావరి ఆలమూరు, మూలస్థానం పెద్ద వంతెనపై జనసేన పార్టీ ఫ్లెక్సీలు తొలగించాలని చిన్న వివాదం
తూర్పుగోదావరి ఆలమూరు మండల పరిధి మూలస్థానము గ్రామంలో కొత్త వంతెన మీద, జన సేన నాయకులు, అభిమానంతో జన సైనికుడు ఫ్లెక్స్ లు గత రెండు సంవత్సరాలుగా ఉంటున్నాయి. పక్కనే అన్ని పార్టీలు కూడా ప్లెక్సీలు కొన్ని సమయాలలో ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి గొడవలు ఉండవు. ఆ గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు గాని, ఎవరికీ ఎలాంటి సమస్యలు గానీ, ఎవరికి అడ్డు కాని రాకుండా ఫ్లెక్సీలు యువకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్య కొంతమంది, అసూయతో, పంచాయతీ సెక్రెటరీ రేణుకకి కంప్లైంట్ చేశారనీ, కంప్లైంట్ లెటర్ చూపించకుండా, సెక్రెటరీ రేణుక ఆధ్వర్యంలో, పోలీసు వారుతో, మూలస్థానం పెద్ద వంతెన పైకి వచ్చి, ఫ్లెక్స్ తీయాలని, పంచాయతీసెక్రెటరీ చెప్పడంతో కొంత అలజడి రేగి, వెంటనే సద్దుమణిగింది. సెక్రెటరీని వివరణ ఆడుగుగా మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారని అడుగగా, ఎవరు పేరు చెప్పకుండా వారు ఫ్లెక్స్ తీసేయాలని అనడంతో చాలా మంది యువకులు మీకు ఏమి అడ్డం వచ్చింది. ఇక్కడ ఏ పార్టీలో వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, అన్ని పార్టీల వారు అందరం కలిసి మెలిసి ఉంటామని, మా గ్రామంలో ఎప్పుడు ఎలాంటి గొడవలు ఉండవని పంచాయతీకి పన్ను కూడా కావాలంటే చెల్లిస్తామని, ఒకవేళ మీకు అడ్డు వస్తే పార్టీలకతీతంగా మొత్తం ఆలమూరు మండలం అంతా ఫ్లెక్స్ లు తీసివేయాలని, అప్పుడు మా గ్రామంలో మేము కూడా తీసి వేస్తామని అన్నారు. మీకు పై అధికారుల నుంచి ఆర్డర్లు వస్తే మాకు చూపించాలని యువకులంతా పట్టుబట్టడంతో ఆ సమయంలో రాయుడు లక్ష్మణరావు ఆలమూరు మండల మాజీ ప్రతిపక్షనేత అక్కడికి వచ్చి, జనసేన నాయకులు కార్యకర్తలతో పాటు, సలాది జయప్రకాష్ తో, పంచాయతీ సెక్రెటరీ రేణుక తో మాట్లాడి అక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. ప్రస్తుతము ఈ విషయం మీద మండల ఎంపీడిఓ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం ఉద్దేశంతో, ఫ్లెక్స్ లు గురించి ఎవరు కి ఇబ్బంది లేనప్పుడు, సమస్యలు పెద్దది చేసుకోకుండా, అధికారులు ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com