నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం వద్ద ఈ రోజు సాయంత్రం ధర్నా జనసేన పార్టీ కాపు నాయకుల అనంతరం ప్రెస్ మీట్ జరిగాయి. వైసిపి కాపు నాయకులను వ్యతిరేకిస్తూ వారు వైసిపి బానిసలుగా వ్యవహరిస్తున్నారంటూ
ప్లకార్డులు చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థను ప్రశ్నించినప్పుడల్లా కమ్యూనిటీకి చెందిన కొందరు నాయకులు చేత ఈ వైసీపీ ప్రభుత్వం దుర్భాషలాడించడం ఆనవాయితీగా మారింది. వైసీపీ నాయకులు ఎవరు కాపులకు రిప్రజెంటేటివ్స్ కాదు వారి బాధల్లో తోడు ఉండేవాళ్ళు కాదు ఎవరు కూడా కాపులకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కాపు నాయకులందరూ వారి పబ్బం గడపడానికి చూస్తున్నారే తప్ప కాపులకు ఎవరూ ప్రాతినిధ్యం వహించింది లేదు వారి సమస్యలకు అండగా నిలబడింది లేదు. వైసిపి కాపులకు రిజర్వేషన్లు కావాలని అడగలేని నాయకులు కాపులు తరపున రిప్రజెంటేటివ్ లా..?సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు కాపులకు కేటాయిస్తానని పలికిన జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించే ధైర్యం లేని నాయకులు. ఎంతోకాలంలో అధికారంలో ఉంటూ కాపులను బీసీ లో చేర్చండి అని అడిగే ధైర్యం లేని ఈ నాయకులు కాపులకు చేసేదేమీ లేదు. కాపు నేస్తం కూడా అర్హులందరికీ వస్తున్నాయా లేదా కనీసం ఒక్క రోజైనా మీరు గమనించారా ? వీరందరూ కూడా వైసీపీకి బానిసలు లాగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులుగా ఎవరు ప్రవర్తించడం లేదు. కాపులకు రాజ్యాధికారం దూరం చేసే విషయంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ వైసీపీ కాపు నాయకులకు కాపుల ఆగ్రహ వేశాలకు గురికాక తప్పదు. సద్దుమరిగిన కోనసీమ అల్లర్ల సాక్ష్యంగా కులమతాలను వైసీపీ ప్రేరేపిస్తుంది.వైజాగ్ అల్లర్లు సృష్టించి సామాన్యుడికి జనవాణితో అందుబాటులో ఉండే జనసేన పార్టీని అణిచివేయాలని చూస్తుంది. కాపులను ఓట్ బ్యాంకులా మాత్రమే చూస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి కాపులందరూ సరైన గుణపాఠం చెప్పాలి. వైసిపి ప్రభుత్వానికి కాపులందరూ ఒక్క త్రాటిపై నడిిచి సరైన సమాధానం చెప్తారు. అసమర్థ ప్రజా పరిపాలన వలన అందరూ వైసీపీని పాలను అంతమొందించాలని భావిస్తున్నారు. కుల మతాలకతీతంగా రాజ్యాధికారాన్ని అందిస్తాం అనుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ నాయకులారా ఖబర్దార్ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే చెప్పు దెబ్బలు తప్పవు. కాపు నేస్తం కూడా అర్హులందరికీ వస్తున్నాయా లేదా కనీసం ఒక్క రోజైనా మీరు గమనించారా??? వీరందరూ కూడా వైసీపీకి బానిసలు లాగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులుగా ఎవరు ప్రవర్తించడం లేదు. కాపులకు రాజ్యాధికారం దూరం చేసే విషయంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ వైసీపీ కాపు నాయకులకు కాపుల ఆగ్రహ వేశాలకు గురికాక తప్పదు. పవన్ కళ్యాణ్ గారికి కులం కంపు అంటగట్టి రాజ్యాధికారాన్ని రానివ్వకుండా చూస్తాలనుకున్న వైసీపీ నాయకులారా ఖబర్దార్ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే చెప్పు దెబ్బలు తప్పవు. అనాల్సిన మాటలన్నీ అని వారి ప్రజల ఆగ్రహ వేశాలకు గురైనప్పుడు అక్రమ కేసులు పెట్టడం పరిపాటి అయిపోయింది. కాపు పిల్లలు చదువుకునేందుకు, విదేశీ యానం వెళ్లేందుకు అవసరమైన లోన్లు ప్రొవైడ్ చేస్తానన్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేని మీరు కాపులకు ప్రతినిధులు కారు.అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమంతా సిద్ధంగా ఉన్నాము చావు రేవో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా వెనక్కి తిరిగి చూసి సమస్య లేదని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, రాష్ట్ర కార్యనిర్వహణ విభాగం కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, వీర మహిళా విభాగం కృష్ణ పెన్నా రివర్స్ కోఆర్డినేటర్ కోల విజయలక్ష్మి, నెల్లూరు లీగల్ సెల్ కార్యదర్శి సుభాషిని, జిల్లా సంయుక్త కార్యదర్శిలు దశనీటి అనిల్ , మళ్లీ కిరణ్, నగర కార్యదర్శిలు సుమంత్ ఆముదాల,సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు సురేష్ బొబ్బేపల్లి, జనసేన పార్టీ నాయకులు గాదం సతీష్, అజయ్ శనివారపు, శ్రీకాంత్, శివ, పసుపులేటి సురేష్, హరి కృష్ణ పసుపులేటి, దాసరి రమణ, అలహరి జీవన్, అక్కిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.