సీతానగరం కొత్త బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి : సీతానగరం జనసైనికులు
ఈరోజు సీతానగరం బ్రిడ్జి పై మండల మరియు నియోజకవర్గం జనసేన పార్టీ తరపున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శివశంకర్ పోతల మాట్లాడుతూ మన సీతానగరం బ్రిడ్జి 1936లో బ్రిటిష్ వారు నిర్మించారు ఇప్పటికి దాదాపు 84 సంవత్సరాలు అవుతుంది అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేసి చేతులు దులుపుకుంటున్నారు దాదాపు కోటి 35 లక్షలు మొన్న మరమ్మత్తులకు ఖర్చు చేశారు అయినా ఫలితం సూన్యం,లోపం ఎవరిది అధికారులదా లేకపోతే స్థానిక నాయకులదా లేకపోతే కాంట్రాక్టర్లదా మీరే చెప్పండి. మొన్న ఖర్చు చేసిన మొత్తం డబ్బులకు తగిన వివరణ ఇవ్వాలని అలాగే నూతన బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జనసేన నాయకులు బాబు పాలూరి గారు మాట్లాడుతూ నిత్యం రెండు వేలుకు పైచిలుకు వాహనాలు తిరిగాడే ఈ అంతర్రాష్ట్ర రహదారికి ఎన్ని సార్లు తాత్కాలిక మరమ్మత్తులు చేసి, కాలయాపన చేస్తారు. ఈ ప్రభుత్వానికి వాహనదారుల కష్టాలు పట్టవా? ప్రాణ నష్టం జరిగితే గాని ప్రభుత్వం కదలిరాదా? గత టీడిపి ప్రభుత్వం నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేవలం శంకుస్థాపన, నిధులు మంజూరు చేసేసి చేతులు దులిపేసుకుంటే, ఇప్పటి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పేపర్ లో ప్రకటనలు తప్ప ఇంకేం కనిపించడంలేదు అని పేర్కొన్నారు. అలాగే పార్వతీపురం నాయకులు మాట్లాడుతూ దాదాపు కోటి 35 లక్షలు రూపాయలు పెట్టి మరమ్మత్తులు చేసి గౌరవనీయులైన MLA శ్రీ అలజంగి జోగారావు గారు మాట్లాడుతూ 20 సంవత్సరాలు ఈ బ్రిడ్జి చూడక్కర్లేదు అన్నారు ఓపెన్ చేసిన 2 నెలలకే గుంతలు ఏర్పడ్డాయి అంటే లోపం ఎవరిది కాంట్రాక్టర్ది ఆ..? లేకపోతే అధికారులదా..? అని డిమాండ్ చేశారు ఇంకా ఎంత కాలం ఈ శీథిలావస్థకి చేరుకున్న బ్రిడ్జినే తిప్పి తిప్పి మరమత్తులు చేసి చేతులు దులిపేసుకుంటారు. బ్రిడ్జి ప్రక్కన తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు ఇదివరకే చిన్నపాటి నీటి యద్దడికే కొట్టుకుపోయింది, ఈ సమస్య కేవలం సీతానగరం మండలంది మాత్రమే కాదు, చుట్టు పక్కల ప్రాంతాలది మరియు మన పొరుగు రాష్ట్రాల సమస్య కూడా. అంచేత ప్రభుత్వ అధికారులు వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం పైన రానున్న అక్టోబర్ 1వ తారీకు లోగా అధికారిక ప్రకటన ఇచ్చి, ఎంత కాలంలో నిర్మిస్తారో కాలవ్యవధిని కూడా ప్రకటించాలని మా జనసేన పార్టీ - సీతానగరం విభాగం తరపున డిమాండ్ చేస్తున్నాం లేని యెడల బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు ఆపివేసి అక్కడే మహా ధర్నా కార్యక్రమం చేపడతాం అని ఇందుమూలంగా విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నాయకులు రెడ్డి కరుణ, అనిల్ చందాకా, విజయ్, సురేష్, రాంబాబు, వెంకటేష్ మరియు బొబ్బిలి నాయకులు గంగాధర్, మండల జనసైనికులు రమేష్ అల్లు, సూర్యనారాయణ, సత్యనారాయణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com