Logo
Date of Publish : 03 September 2020, 10:48 am
Editor : Sake Naresh

జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ ను సన్మానించిన సీతానగరం జనసైనికులు

జనసేనాని జన్మదిన సందర్భంగా కరోనా ఫ్రంట్ వారియర్స్ ను సన్మానించిన సీతానగరం జనసైనికులు

                        జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా అత్యుత్తమ సేవలు అందిస్తున్న మన Dr. జగన్ గారికి(సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ) మరియు Dr. నీలిమా గారికి (పెదంకలాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వీరి ఇరువురికి జనసేనాని ఆకాంక్ష మేరకు  బుధవారం నాడు మధ్యాహ్నం 12:00గంటలకు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంని మండల జనసైనికులు అధ్యక్షత వహించి ముందుగా జనసేన అధ్యక్షులు వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మన మండలంలో ఇలాంటి గొప్ప డాక్టర్స్ ఉండడం మన అదృష్టం అని, కరోనా కష్టకాలంలో వీరు చేసిన సేవలు మరువలేనివి అని జనసేనాని స్పూర్తితో ఇలాంటి వ్యక్తులకు సన్మానం చెయ్యడం మా అదృష్టంగా బావిస్తున్నాం వీరి ఇరువురికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువేనని పేర్కొన్నారు. 

                  అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ జగన్ గారు మాట్లాడుతూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము చేసిన సేవను గుర్తించి సన్మానం చేసినందుకు, ఇలా సమాజానికి సేవ చేస్తున్న మా తోటి వారికి కూడా ఈ సన్మానం అంకితం అని పేర్కొన్నారు. అలాగే డాక్టర్ నీలిమా గారు మాట్లాడుతూ మేము చేస్తున్న సేవలు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. మమ్మల్ని గురించి సన్మానం చెయ్యడం వలన మాకు ఎంతో ప్రోత్సహంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు శివశంకర్ పోతల అల్లు రమేష్, పైలా సత్యనారాయణ, రెడ్డి మణికంఠ, సూర్యనారాయణ, వెంకటరమణ, అరవింద్,సోమేశ్, నాగేశ్వరావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com