Logo
Date of Publish : 08 December 2025, 8:54 pm
Editor : Sake Naresh

కళ్ళతో అభినయం దానగుణం సినీ నటి సావిత్రి సొంతం – శిఖా శాంసన్ ఘంటసాల కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు

కళ్ళతో అభినయం చేతికి ఎముక లేని దానగుణం సావిత్రి సొంతం - ఘంటసాల కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శిఖా శాంసన్.

క్రోసూరు.డిసెంబర్08.(జనస్వరం)

తన కళ్ళతోనే భావాన్ని పలికించగలిగిన అద్భుతమైన నటనా కౌశలము సొంతం చేసుకున్న నటి,తమిళుల చేత నడిగర్ తిలకం అని పిలిపించుకున్న చలనచిత్ర నటి కళాభినేత్రి సావిత్రి అని ఘంటసాల కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శిఖా శాంసన్ అన్నారు. క్రోసూరు అమరావతి బస్టాండ్ లోని ప్రయాణికుల ప్రాంగణంలో కళాసమితి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి 90 వ జయంతి సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మహానటి సావిత్రి జీవిత విశేషాలను శాంసన్ వివరిస్తూ 16 అణాల తెలుగు నటి అంటూ చిన్ననాడే అగ్రతారగా వెలిగిన సావిత్రి గొప్పతనం నట్టంతో మాత్రమే కాదు, ఆకాశమంత గొప్ప మనస్తత్వం ఆమెకు మాత్రమే సొంతం అన్నారు.దానధర్మాల విషయంలో ఆమె ఎముకలేని చెయ్యి అని సినీ పరిశ్రమ నేటికి గుర్తు చేసుకుంటుంది అన్నారు ఒకసారి నిండుగా నగలతో ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి కలిసేందుకు వెళ్లిన ఆమె,అక్కడే తాను ధరించిన అన్ని నగల్ని ప్రధానమంత్రి సహాయనిధికి దానం చేయడం ఆమె గొప్ప మనసుకు, ఔదార్యానికి ఉదాహరణ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, పోతుగంటి శ్రీనివాసరావు, షేక్ జానీ భాష, పోతుగంటి లక్ష్మయ్య, బండారు మైసూర్ , నాగరాజు, సింగర్ మస్తాను, షేక్ జముల తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com