
విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ మువ్వల ఈశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం బోయపాలెం గ్రామానికి చెందిన శ్రీ ఈశ్వర రావు కుటుంబాన్ని జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శనివారం సాయంత్రం పరామర్శించారు. శ్రీ ఈశ్వర రావు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. తల్లి శ్రీమతి అర్జునమ్మ, సోదరుడు శ్రీ సంతోష్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ పక్షాన రూ.5 లక్షల బీమా చెక్కును అందచేశారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించింది. "పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ యోగ క్షేమాల గురించి ఆలోచించే మంచి మనసున్న నేత మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు” అన్నారు.అలాగే భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ దోబీ కాలనీలోని శ్రీ పెంటతాడి త్రినాథ్ జనసేన క్రియాశీలక సభ్యులు. నిర్మాణ కూలీగా పని చేసే శ్రీ త్రినాథ్ ఇటీవల ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని శ్రీ మనోహర్ గారు పరామర్శించారు. శ్రీ త్రినాథ్ తల్లి శ్రీమతి లక్కమమ్మకు రూ.5 లక్షలు చెక్కు అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి. శివశంకర్, శ్రీ బొలిశెట్టి సత్య, శ్రీమతి పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి. రత్నం, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బోడపాటి శివదత్, అధికార ప్రతినిధులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కర రావు, డాక్టర్స్ సెల్ ఛైర్మన్ శ్రీ బొడ్డేపల్లి రఘు, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల, చోడవరం ఇంఛార్జ్ శ్రీ పీవీఎస్ఎన్ రాజు, సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ వి.గంగులయ్య, విశాఖ ఉత్తర ఇంఛార్జ్ శ్రీమతి పి. ఉషాకిరణ్తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితురులు పాల్గొన్నారు.