పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని మీరు చూసారా ? మొన్న దివీస్ బాధితులకు అండగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించినపుడు తన ప్రసంగం అయిపోయాక పవన్ కళ్యాణ్ గారికి పరిచామయ్యారు అదే సభ మీద. తన పేరు జెసి దివాకర్... కొత్త పాకల గ్రామ వాసి. తాను 2014 నుంచి జనసేన పార్టీ సిద్దాంతాలకు అభిమాని. ఆ గ్రామంలో మొదటి జనసైనికుడు. ఇంటింటికి తిరిగి జనసేన సిద్దాంతాలను వివరిస్తే ఇతర పార్టీ వాళ్ళు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. తమ ప్రాంతానికి దివీస్ పరిశ్రమ వస్తే ఎంత నష్టపోతున్నామో అక్కడి ప్రజలకు తెలియజేస్తే ఇతర పార్టీ వాళ్ళు దాడి చేశారు. నువ్వు ఏమి చేయగలవు ? మీ పార్టీ నాయకుడు వచ్చి ఏమి చేయగలడు అని హేళన చేసారు. ఎలాగైనా జనసేన పార్టీ తరుపున తమ ప్రాంతానికి న్యాయం చేయాలని బలంగా నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా విశాఖపట్నంలోని పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ శివ శంకర ప్రసాద్ గారిని, శ్రీ బొలిశెట్టి సత్య గారిని, జనసేన నాయకులు వన్నెం సతీష్ కుమార్ గారిని కలసి తమ ప్రాంత సమస్యను వివరించారు. ఆ ప్రాంత సమస్యని విని జనసేన నాయకులు చలించి పోయారు. కొన్ని రోజుల తరువాత కొంతమంది రైతులతో కలసి విశాఖ పట్నం పార్టీ ఆఫీసుకి తీసుకొని వెళ్ళి సమస్యను వివరంగా వివరించారు. వెంటనే జనసేన నాయకులు దివీస్ బాధితులు నిరాహార దీక్ష చేస్తున్న ప్రాంతానికి వచ్చి వారి బాధలను విన్నారు. ఈ విషయాన్ని ఏ మీడియా చూపించకపోగా జనసేన నాయకులు తమ బాధ్యతగా ప్రపంచానికి తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు సమస్యను తీవ్రంగా పరగణించి బలంగా పోరాడాలనుకున్నారు. స్థానిక జిల్లా నాయకులతో అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. జనసేన నాయకులు శ్రీ పంతం నానాజీ గారు అక్కడి సమస్యను పూర్తిగా తెలుసుకొని అధ్యక్షుల వారికి, రాజకీయ వ్యవహారాల చైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి వివరించారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సమస్య గురించి పూర్తిగా అధ్యయనం చేసి గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ సమస్యకు పరిష్కారం చూపాలని లేదంటే పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగుతారని హెచ్చరించారు. చెప్పినట్టుగానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ప్రసంగం పూర్తి అవగానే జనసేన కోసం, పార్టీ సిద్దాంతాల కోసం అపహర్నిశలు కష్టపడుతున్న కొత్తపాకల జనసైనికుడు జెసి దివాకర్ కృషిని గుర్తించి జనసేన నాయకులు శ్రీ వన్నెం సతీష్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. జనసైనికులు అందరూ జెసి దివాకర్ ను అభినందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com